-: అమ్మమ్మ కథలు :-




దేశాన్ని ఏలే రాజైన సరే అమ్మకి అమ్మమ్మకి చిన్న పిల్లవాడే . ఏమి నేను చెప్పేది అబద్దమా? కాదు కదా. నువ్వు చెప్పు మీ అమ్మ మీ అమ్మమ్మకి గారాల కూచి కాదా? నువ్వు మీ అమ్మకి ముద్దుల మూటవి కావా? అని పేదరాశి పెద్దమ్మ అడిగిన ప్రశ్నకి  పక పకా నవ్వేశారు అక్కడ పిల్లలు అంత. ముద్దులొలికే మీ చిన్ని మోహము లో వికసించే ఈ నవ్వులు చూస్తుంటే నాకు కన్నయ్య గుర్తొస్తున్నాడు అని అన్నది ఆవిడ. ఏంటి? కన్నయ్య? ఎం చేసాడు కన్నయ్య అని ఒకేసారి ఆ పిల్లలు అందరు అడిగేసరికి ఓరి పిల్లలు మీ అమ్మ నాన్నలు డ్యూటీలు చేసుకుంటూ ఉండిపోయి మీకు కన్నయ్య  గురించి చెప్పడం మర్చిపోయి ఉంటారు అని ఆవిడ నవ్వేసింది. ఎందుకు అమ్మమ్మ ఎప్పుడు మా అమ్మ ని నాన్నని తిడుతూ ఉంటావు అని అందులో ఒక పాప అడిగింది. ఏమి లేదే ముసలిదాన్ని ఐపోయాను కదా అందుకే కాస్త చాదస్తం అని అన్నది. అది సరే నువ్వు ముందు కన్నయ్య గురించి చెప్పు త్వరగా అని ఒక కుర్రవాడు ఆతృతగా అడగగానే ఇలా మొదలు పెట్టింది ఆ పేదరాశి పెద్దమ్మ.






కన్నయ్య! క్రిష్నయ్య!! ఎక్కడ ఉన్నావయ్యా? ఆడుకోడానికి పోయి ఇంకా ఇంటికి రావేమి? అని మనసులో కంగారుగా అనుకుంది యశోద కొడుకు ని తలుచుకుంటూ ఇంట బయట నిలబడి పొద్దుపోతున్న ఆకాశాన్ని చూస్తూ కంగారుగా .

ఈలోపు నందుడు రానే వచ్చాడు. ఏంటి యశోద ఇంకా కన్నయ్య ఇంటికి రాలేదా? అని అడిగేసరికి అయ్యో రాలేదండి .వాడికోసమే ఎదురు చూస్తున్న అని చెప్పింది. ఇంత పొద్దు పోయేవరకు రాకుండా ఎక్కడ ఉన్నాడు? ఎం చేస్తున్నాడు? అని అడిగాడు నందుడు. ఉండు నేను వాడు రోజు ఆదుకునే వీధుల్లో వెతికి వస్తాను అని మల్లి బయటికి నడవబోతే ఈలోపు వాడు ఇంటికి వస్తే మిమ్మలిని ఎక్కడని వెతకను అని అమాయకంగా అడిగింది యశోద. అది నిజమే బలరాముడు ఎక్కడ? అని అడిగాడు నందుడు. బలరాముడు వాళ్ళ అమ్మతో గుడికి వెళ్ళాడు అని చెప్పింది యశోద. సరే వాడిని వెంట పెట్టుకుని కన్నయ్య స్నేహితులు ఇంటికి వెళ్లి చూసి వస్తాను అని అన్నాడు నందుడు. బలరాముడు కి కన్నయ్య స్నేహితులు అందరు యెఱుగునా? అని అడిగిన యశోద ప్రశ్నకి నందుడు ఆలోచించాడు. మరి ఎలా అమ్మమ్మ అంత ఆలస్యం అయిపోతుంటే కన్నయ్య ఎక్కడ ఉన్నదో ఎలా తెలుస్తుంది? అని అడిగింది పేదరాశి పెద్దమ్మ పక్కన కూర్చున్న రెండు జడల పిల్ల. తప్పి పోయిన వాళ్ళని వెతకొచ్చు ఆటకి పోయిన వాళ్ళని లాక్కుని రావచ్చు కానీ అల్లరి చేసి దాక్కునే గడుగ్గాయిని పట్టుకోవడం అంత సులువు కాదు కదా అని నవ్వేసింది పేదరాశి పెద్దమ్మ. ఆవిడ నవ్వగానే అక్కడ వాళ్లంతా నవ్వేశారు. నందుడు కి తెలియనిది కాదు కన్నయ్య అల్లరి, యశోదకి తెలియనిది కాదు కొడుకు మనసు. నందుడు కొడుకుని వెతకడానికి వెళ్లి ఏమైనా అల్లరి పని చేస్తూ దొరికిపోతే తిట్లు తింటాడేమో అని నందుడిని వెళ్లకుండా ఆపుతుంది. వాడే వస్తుడులే ఇంకా పక్షులు గూటికి చేరే సమయం కాలేదేమో అని వెనకేసుకొస్తూ. చాలు చాలు నీ కొడుకుని వెనకేసుకొని రావడం ఆపు అని అన్నాడు నందుడు కంగారుగా. ఎక్కడ అల్లరి చేస్తున్నాడో ఎవరితో గొడవ పెట్టుకుని వస్తాడో అని రోజు లాగే ఈరోజు కూడా ఎదురు చూస్తూ ఉండు అయితే అని నందుడు అనగానే నా కొడుకు బంగారం కొండా వాడికి వేరే పని లేదు అనుకున్నారా? అని ఎర్రపడిన మొహం పెట్టుకుని అలిగిన స్వరం తో అడిగింది యశోద. నీకు తెలియనిదా? మొన్నటికి మొన్న, అథ కోడళ్ళకి గొడవ, మొగుడు పెళ్ళల్లా మధ్య గొడవ పెట్టి వచ్చాడు. ఇంట్లో ఇన్ని పాలు,పెరుగుఉంటె ఊరంతా స్నేహితులతో తిరిగి అందరింట్లోని దొంగతనం చేస్తున్నాడు.ఇంకా చెప్పనా ..... అని నందుడు చెప్పుకుంటా పోతుంటే చాలు చాలు నా కొడుకుకి దిష్టి పెట్టింది చాలు మీరు గారం చేయడం వల్లనే కదా ఇలా తేయారయ్యాడు అని గడుముతు అడిగిన యశోదని చూసి ఒక నవ్వు నవ్వాడు. నీ గారాల కొండకి కి గారం కొత్తగా నేను పెట్టి చెడగొట్టానని నన్ను ఆడిపోస్తున్నావా యశోద అని అడగగానే తల దించుకుని నవ్వేసింది. అమ్మ నాన్నగ మనమేనా ముద్దు చేసేది నీ ముద్దుల కొడుకుకి గోకులం అంత మురిసిపోతుంది ఈ అల్లరి చూసి అని నవ్వాడు నందుడు. ఇదిగో ఇదిగో కన్నయ్య వచ్చాక ఏమి అనకూడదు అని అన్నది యశోద. సరే సరే కానీ ఇంకా ఈ చిన్ని కృష్ణుడు ఎక్కడ అని నందుడు అడుగుతుండగానే కన్నయ్య ని ఇద్దరు ఆడవాళ్ళూ తీసుకుని వచ్చారు. ఇదిగో యశోదమ్మ నీ కొడుకు అల్లరి కట్టిస్తావా? మమ్మల్ని కట్టించమంటావా? అని వాళ్ళు గెట్టిగా అడిగేసరికి అమాయకమైన తన కొడుకు మొహం చూసి అయ్యా నా కన్నయ్య ఎం చేసాడని ఆలా అంటున్నారు అని పిల్లాడిని గెట్టిగా హత్తుకుని అడిగింది యశోద. మల్లి ఎదో చేసి వచ్చాడు అని నందుడు అనుకునే లోపే మీ అబ్బాయి అల్లరి చేష్టలకి హద్దు లేదు అని నందుని చూస్తోరు వాళ్ళు.. ఆవు దూడని విప్పి పక్కింటికి తోలాడు అక్కడ మేస్తున్న గెడ మా ఇంటికి వచ్చి పాచిక మేస్తుంది. ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటూ మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాడు అని అన్నారు వాళ్లిద్దరూ. నిజమా కన్నయ్య?అని అమాయకంగా అడుగుతున్న యశోద కి మురిపెంగా ముడ్డి పెట్టి నాకేం తెలుసమ్మా? చిన్న పిల్లాడిని వాటిని చూస్తేనే భయం అని అన్నాడు. చిన్న పిల్లాడిని అనడానికి మీకు మనసు ఎలా ఒప్పింది అని యశోద అడగగానే చిన్న పిల్లోడా? అని బుగ్గలు నొక్కుకుంటూ అడిగారు ఇద్దరు. చెప్పు అక్క, నీ గెడ ని విప్పి తెచ్చింది ఈ బుడతడు కదూ అని పక్కన ఉన్న ఆమెను అడగగానే అవును నా గెద ని విప్పి దీని ఇంట్లో ఉన్న పాచికనంత తినేలా చేసాడు అని అన్నది. మా ఆయనకీ కోపం వచ్చేలా చేసాడు. ఏమి కాదు అబద్దాలు చెప్తున్నావు నువ్వు అని అన్నాడు కన్నయ్య వాళ్ళ మాటలు విని. అబద్దమా? అని రెట్టించి అడిగారు ఇద్దరు. అవును రెండు రోజులు నుంచి మీ ఇద్దరి గొడవ వల్ల మీ ఆయనికి మనశాంతి లేదు అందుకే కోపం వచ్చింది అది చెప్పవేమి అని అన్నాడు కన్నయ్య. నిజమా? అన్నట్లు కొడుకుని అడిగింది యశోద. ఇదంతా ఎప్పుడు ఉండేదెలా అన్నట్లు తల్లి కొడుకులని చూసాడు నందుడు. మాట మార్చకు కన్నయ్య అని అన్నారు ఇద్దరు. నిజం చెప్పు నిన్నటి నుంచి మీ ఇద్దరి గొడవ వల్ల నీ గెద కి మేత వేయలేదు , పాపం ఆకలితో దూడ అంబ అని అంటుంటే  ఏమి చేయలేక చూసి బాధపడుతున్న నీ ఆవుని చూసి ఉండలేకపోయాను అని కన్నయ్య చెప్పగానే అవాక్కయినట్లు చూసారు ఇద్దరు. ఇప్పుడు ఇద్దరికీ నాతో సమస్య కాబట్టి ఇద్దరు కూడా పలుక్కుని మా అమ్మ నాన్న కి నా పై చాడీలు చెప్పడాన్ని వచ్చేసారు అని కృష్ణుడు అనగానే అవును నిజమే అన్నట్లు యశోద నందులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వెళ్ళండి ముందు మీ ఇళ్ళకి పోయి ఆ మూగ జీవాలకు ఎం కావాలో చూడండి తర్వాత నా కొడుకుని ఆడిపోసుకుందురు అని చెప్పగానే కొంగులు దులుపుకుంటే నిజమే ఐన వాటి గురించి నీకు ఎవరు చెప్పారు అని రెట్టించి అడిగారు ఇద్దరు. అమ్మ అంటూ గారం గ కాన్నయ్య అమ్మని గెట్టిగా పట్టుకునే సరికి పొండి ఇక్కడ నుంచి చంటి పిల్లాడిని బయపెట్టేస్తున్నారు అని వాళ్ళని తిట్టేసి కొడుకుని లోపలి తీసుకుపోతుంటే వెళ్లిపోతున్నా వాళ్లిద్దరినీ అమ్మ చాటున చేరి అమాయకంగా చూస్తున్న కృష్ణుడి అల్లరి పని ని పసిగెట్టేసాడు తండ్రి నందుడు అని పేదరాశి పెద్దమ్మ చెప్పగానే అందరు నవ్వేశారు. కన్నయ్య నిజంగానే అల్లరి వాడు. ఎంత అల్లరి చేసిన దొరకకుండా ఎంత ఎత్తు వేసాడు. మాయ చేసాడు. వాళ్లదే తప్పు అన్నట్లు అమ్మ దెగ్గర గారాలు పలికాడు కానీ చివరికి నాన్నను దొరికిపోయాడు. ఇంకా కథ కంచికి మనం ఇంటికి.


--

అంజన

Comments

Popular Posts